సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు చేయటంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవటం సిగ్గుచేటు..ఏడాదికి 41 వేల కోట్లు అప్పులు తెస్తామని ఆరు నెలల్లోనే ప్రభుత్వం 49 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఒడించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావాలని చెప్పిన పవన్ ఇవాళ నేను సెపరేట్ అంటున్నారు..బీజేపీ, వైసీపీ ఒకరికొకరు ఒద్దికగా పరస్పరం కలిసి పోయారన్నారు రామకృష్ణ. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారో ఇప్పుడే చెప్పలేం అన్నారు. అయితే ప్రజలు బీజేపీ, వైసీపీ ఒకటే అనే భావనలో వున్నారన్నారు.
Read Also: Minister Sidiri Appalaraju Press Meet Live: మంత్రి సీదిరి అప్పలరాజు ప్రెస్ మీట్
కేంద్రానికి ప్రతీ విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారు.బీజేపీ, వైసీపీలు పెళ్లి చేసుకోలేదు కానీ కలసి కాపురం చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ బీజేపీ ని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే ఆయనను ఆమాయకుడు అనుకోవాలా..పవన్ అన్నీ తెలిసే నటిస్తున్నాడా..వచ్చే ఎన్నికల్లో గలవకపోతే అవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు అనటంలో తప్పులేదు..కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ను గద్దె దించేందుకు ఎవరినైనా కలసి నడుస్తాం..ఏపీలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తుందన్నారు రామకృష్ణ.
Read ALso: Casino Case: ‘చీకోటి’ క్యాసినో కేసులో ఈడీ దూకుడు.. ఇప్పటికే పలువురికి నోటీసులు