నకిలీ కాల్ సెంటర్ల గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. అమెరికన్ పౌరులను టార్గెట్ చేసి భారీ స్కాంకు పాల్పేడుతున్న ముఠాను పట్టుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో అమెరికన్ సిటిజన్లను మోసం చేస్తోంది మాదాపూర్ లోని ఏఆర్‌జే సొల్యూషన్స్. గుజరాత్‌లో నమోదైన సంస్థ ఇక్కడి కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతోంది. దీంతో పాటు నకిలీ అమెజాన్ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ ఫేక్ కాల్ సెంటర్ ను నడుపుతున్నారని, యూఎస్ , కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ,అమెజాన్ ఫేక్ కాల్ సెంటర్‌ను రన్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. రెండు ముఠా లను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు.
Also Read : Top Headlines @5PM : టాప్ న్యూస్
గుజరాత్ గ్యాంగ్ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని, యూఎస్ సిటిజన్స్ కు కాల్ చేసి డబ్బులు వసూలు చేస్తోంది ఈ ముఠా అని ఆయన వెల్లడించారు. టెలికాలర్స్ అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారని, ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తూ బోర్డర్ కస్టమ్స్, యూ ఎస్ ఫేక్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. Callcentersindia.com, localbitcoin.com, Paxful వెబ్ సైట్స్ తో మోసాలు చేస్తున్నారు… యూఎస్ సిటిజన్స్ కు కాల్ చేసి బెదిరించి 5000 డాలర్స్ నుంచి వసూలు చేసున్నారు.. నిందితుల నుంచి 7 ల్యాప్ టాప్స్, 115 సిపీయులు, 94 మానిటర్స్, 4 వైఫైరూటర్స్, 120 మొబైల్స్, రూ.2,55,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read : Jeff Bezos Buys Estate: రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్ కొన్న బెజోస్.. ఎవరి కోసమో తెలుసా?