Cow Dung : పేడండి.. పేడ.. స్వచ్ఛమైన ఆవు పేడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగువారు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు… ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నవారంతా.. సొంతూళ్లకు పయనమవుతుంటారు. విదేశాల్లో ఉన్నవారు సైతం సంక్రాంతి పండుగకు సొంతూరుకు చేరుకొని బంధుగనంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ముగ్గులు. ఇంటి ముందు రకరకాల అందమైన ముగ్గులు వేసి అందులో ఆవుపేడను గొబ్బెమ్మగా పెడుతుంటారు. అయితే.. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. గతంలో ఆన్లైన్లో పిడకలు అమ్ముతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు గొబ్బెమ్మలకోసం పేడను అమ్ముతుండటం విశేషం. పేడండి.. పేడ.. స్వచ్ఛమైన పేడ అంటూ.. నల్గొండలో మహిళలు కొద్దిపాటి ఆవు పేడను రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తూ కనిపించారు.

Also Read
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
- Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Wonder: పొలంలో ఏడు రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్న ఆవు.. అద్భుతమంటూ ఎగబడిన జనం..
Also Read : China: చైనాలో కొవిడ్ కల్లోలం.. 35 రోజుల్లోనే 60 వేల మరణాలు
వారు తెచ్చిన ఆవు పేడ మొత్తం పట్టణంలోకి రావడంతో రెండు గంటల్లోనే అమ్ముడుపోయాయి. నల్గొండలోని రామగిరిలో పేడను విక్రయిస్తున్న పెద్ద సూరారం గ్రామానికి చెందిన గుండె లక్ష్మమ్మ అనే మహిళ మాట్లాడుతూ శుక్రవారం నుంచి ప్రతిరోజు దాదాపు 10 కిలోల ఆవు పేడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి రోజున ఆదివారం డిమాండ్ మరింత ఎక్కువగా ఉండవచ్చని, తాను తెచ్చిన పేడ రెండు గంటల్లోనే అమ్ముడుపోయిందని ఆమె అన్నారు. మరో మహిళ, కె రమ్య మాట్లాడుతూ, గొబ్బెమ్మను రంగోలిలో ఉంచడం వల్ల సంక్రాతి సమయంలో గొబ్బెమ్మ యొక్క ఆచార ప్రాముఖ్యతతో పాటు సాంప్రదాయకమైన రూపం వస్తుంది. పట్టణాలు మరియు నగరాల్లో ఆవు పేడ దొరకడం చాలా కష్టమైన పని కాబట్టి, సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతిని జరుపుకోవడానికి పేడను విక్రయిస్తు్న్నట్లు తెలిపింది.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
తాజావార్తలు
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
-
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
-
Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
-
Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
-
Pinarayi Vijayan: రాహుల్ గాంధీ వల్ల బీజేపీకి లాభం.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!