Site icon NTV Telugu

Corona Cases: కరోనా దాడి… ఈ ఏడాది తొలిసారిగా 1000 దాటిన యాక్టివ్ కేసులు

Corona

Corona

కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ ఏడాది తొలిసారిగా యాక్టివ్ కేసులు 1000 దాటాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసి గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ ప్రకారం, కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 209, ఢిల్లీ 104 యాక్టివ్ కేసులతో మూడవ స్థానంలో ఉన్నాయి. కర్ణాటకలో కొత్తగా 34 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 47కి పెరిగింది.

Also Read:Kandula Durgesh: ఏరోజూ సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!

హర్యానాలో 76 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దీనితో, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 83కి పెరిగింది. రాజస్థాన్‌లో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 12కి పెరిగింది. అలాగే, యుపిలో 15 కొత్త కేసులు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆరోగ్య శాఖ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

Also Read:Famous Temples In India: భారతదేశంలో చూడవలిసిన ప్రసిద్ధ దేవాలయాలు ఇవే..!

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం, ఢిల్లీలో ప్రస్తుతం 104 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి. గత వారం రోజుల్లో 99 కొత్త కేసులు నమోదవడం ఆరోగ్య శాఖకు, పౌరులకు ఆందోళన కలిగిస్తోంది. గత వారంలో 99 కొత్త కేసులు నమోదయ్యాయంటే వైరస్ ఇంకా పూర్తిగా నియంత్రించబడలేదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

Exit mobile version