సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ క్యామియో ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కింది. భారీ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఎక్కడ చుసిన కూలీ ఫీవర్ తో మారుమోగిన కూలీ ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగిసాయి.
Also Read : War2 Review : వార్ 2 ఓవర్సీస్ రివ్యూ..
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే.. సూపర్ స్టార్ 50 ఇయర్స్ స్పెషల్ టైటిల్ కార్డుతో స్టార్ట్ అయిన కూలీ సినిమా స్టార్ట్ అయినా మొదటి గంట వరకు చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ఒకే ఒక ఫైట్ హై ఫీల్ ఇస్తుంది తప్ప రిమైనింగ్ అంత వీక్ నేరేషన్ లో సాగుతుంది. ఊహించని మలుపుతో మరియు మంచి ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్‌తో ముగిసింది. ఫస్ట్ హాఫ్ ను నాగార్జున మరియు సౌబిన్ షాహిర్ చాలా వరకు సేవ్ చేసారు. నాగార్జున స్టైల్ మరియు నటన, ఐ యమ్ ది డేంజర్ సాంగ్ ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఉంటాయి. ఇక సెకండాఫ్ స్టార్ట్ అవడమే నీరసంగా స్టార్ట్ అయిన కూలీ వావ్ అనిపించే మూమెంట్ ఎక్కడ కనిపించదు. యాక్షన్ సన్నివేషాలలో కొన్ని పాత సినిమా పాటలను ఉపయోగించడం తప్ప, లోకేష్ ఎక్కడ తన క్రియేటివిటీ చూపించలేదు. సూపర్ హిట్ అయిన మోనికా పాట ప్లేస్ మెంట్ అసలు సెట్ అవలేదు. ఇక క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు తప్ప చెప్పుకోవానికి ఏమి లేదు. ఓవరాల్ గా కూలీ అంచనాలను అందుకోలేదని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్.