లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను వెల్లడించింది. మధ్యప్రదేశ్, గోవా, డీఎన్.హవేలీ నియోజకవర్గాలకు చెందిన ఆరుగురు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించింది.
నార్త్ గోవాకు రమాకాంత్ ఖలప్, సౌత్ గోవాకు విరియాటో ఫెర్నాండెజ్, మోరెనాకు సత్యపాల్ సింగ్ సికర్వార్, గ్వాలియర్‌కు ప్రవీణ్ పాఠక్, ఖాండ్వాకు నరేంద్ర పాటిల్, దాదర్ & నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ పేర్లను ప్రకటించింది. గోవాకు చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాకు ఈసారి సీటు లభించలేదు. బరి నుంచి తప్పుకున్నారు.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక శుక్రవారం కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేసింది. మహిళలు లక్ష్యంగా అనేక పథకాలను ప్రకటించింది. ఏడాదికి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని పేర్కొంది. ఇక ఇంటింటికీ వెళ్లి కార్యకర్తలు ప్రచారం చేయాలని కాంగ్రెస్ పిలుపుఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అనంతరం ఏప్రిల్ 25, మే 7, 13, 20, 25, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.

C 1