Ponnam Prabhakar: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే.. మీరు దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బీజేపీ కాదా…? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా…? అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే జరపాలని ఎవరికెంతో – వారికంత అని నినాదిస్తే.. ప్రభుత్వం తరుపున కుల గణన సర్వేకి సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా…? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్ళంతా నక్సలైట్లు అంటున్నారు.. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా…? అని అన్నారు. సివిల్ సర్వీస్ లకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం కాదా..? అని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో సివిల్ సర్వీస్ లలో ఓబీసీలకు 27 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 15.92 %.. ఎస్సీలకు 15 % వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 7.65% మాత్రమేనని తెలిపారు. ఎస్టీలకు 7.5% వాట దక్కాల్సి ఉండగా – దక్కిన వాట 3.8% మాత్రమేనని అన్నారు.
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!
దేశ సంపద అంతా ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ పోర్టులు, పోర్టులు, జాతీయ రహదారులు.. అదానీ, అంబానీలకు అప్పగించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ హయంలోనే 150 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చింది మీరు కాదా..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఉపర్ జై శ్రీరాం – అందర్ రిజర్వేషన్కు రాం రాం అంటున్నారన్నారు. మీరు ఎప్పుడూ పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తారు .. తెలంగాణలో గత ఎన్నికల్లో బలహీన వర్గాల నుండి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభ పక్ష పదవి కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదన్నారు. మీరు ఈ 10 సంవత్సరాల్లో దళితులు, బడుగు బలహీన వర్గాల సంక్షమం కోసం తీసుకున్న ఒక్క కార్యక్రమం అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణకి సంబంధించి 7 మండలాలు, సీలేరు ప్రాజెక్ట్లను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రాకి అప్పగిస్తే కనీసం స్పందించారా..? అని అన్నారు.
తెలంగాణలో మీకు ఓటు అడిగే హక్కు లేదు.. మేం తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమించాం. కానీ ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై అవహేళన మాట్లాడుతూ అమరవీరులకు అవమానించిన కనీసం పార్లమెంట్లో ఉండి కూడా మీరు మాట్లాడలేదు… తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది..
తెలంగాణలో కుల గణన చేపట్టాం.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం మేము ఎవరెంతో – వారికంత న్యాయం చేస్తామన్నారు. మీరు రాజకీయంగా గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పని చేయడం తప్ప తెలంగాణ విభజన హామీలు అమలు చేశారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!