Kishan Reddy : కేసీఆర్ మొండి వైఖరితోనే సింగరేణికి తీరని అన్యాయం
- కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
- సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు
- జెన్కోకు కీలక సూచన
- పేపర్ లీక్ చట్టంపై వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వింత ప్రవర్తన, మొండి వైఖరి వల్లే సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా బొగ్గు గనులను పారదర్శకంగా వేలం పాట ద్వారా కేటాయించాలని ఆదేశించినప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. నూతన బొగ్గు బ్లాకులు లభించక, ఆదాయ మార్గాలు మూసుకుపోయి సింగరేణి వెనుకబడిపోవడానికి కేసీఆర్ ద్రోహమే కారణమని ఆయన ఆరోపించారు. సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, గతంలో కేంద్రం ఇచ్చే రూ. 525 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోయారని విమర్శించారు.
నైని కోల్ బ్లాక్ పురోగతి , జెన్కో పోటీపై హెచ్చరిక
2015లోనే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించినప్పటికీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఒడిశా ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అయితే, ఇటీవల ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చొరవ తీసుకుని నైని కోల్ బ్లాక్‌కు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులను ఇప్పించినట్లు వెల్లడించారు. అలాగే తాడిచర్ల-2 బ్లాక్‌ను కూడా కేంద్రం సింగరేణికి కేటాయించిందని, మణుగూరులోని ఒక బ్లాక్‌ను వేలంలో ఉంచామని తెలిపారు.
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
అయితే ఈ వేలంలో సింగరేణికి పోటీగా తెలంగాణ జెన్కో (TSGENCO) పాల్గొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జెన్కో టెండర్ నుంచి తప్పుకుని, ఆ బ్లాకులు సింగరేణికి దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సీఎంకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ మూడు కొత్త బ్లాకులు సింగరేణికి దక్కితే సుమారు 6,500 మందికి ఉద్యోగావకాశాలు రావడంతో పాటు, 830 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగి, దాదాపు రూ. 1.95 లక్షల కోట్ల టర్నోవర్‌తో సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజీల నిరోధానికి కఠిన చట్టం..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ పరీక్షల చట్టం గురించి మాట్లాడుతూ.. 2024లోనే ఎలాంటి డిమాండ్లు, నిరసనలు లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా ఈ యాంటీ-పేపర్ లీక్ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పేపర్ లీకేజీలకు పాల్పడాలంటే భయపడేలా, గుండెలాగిపోయే స్థాయిలో అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా స్వాగతిస్తుందని భావిస్తే, వారు చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. ఫలితాలు వచ్చిన వేళ నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చివరగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన దాడి ఘటన తీవ్ర బాధాకరమని, దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!