Agent: ‘ఏజెంట్’ కోసం రంగంలోకి ప్రభాస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్, అన్నీ తానే అయ్యి ఏజెంట్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే అఖిల్ చేసిన రియల్ స్టంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయవాడలో ట్రైలర్ లాంచ్ పోస్టర్ అనౌన్స్మెంట్.. కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఏజెంట్ పై మరింత బజ్ తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఏజెంట్ పై భారీ బజ్ రావాలంటే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ స్కేల్ లో, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే రేంజులో చెయ్యాలి. అందుకే ఏజెంట్ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మాసివ్ గ్రాండ్ ఈవెంట్‌ని ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ ఈవెంట్‌కు ముందుగా చరణ్ లేదా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఈ ఈవెంట్‌పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచరం. ఒకవేళ ప్రభాస్ ఈ ఈవెంట్‌కి వస్తే.. ఏజెంట్‌కు భారీ హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే డార్లింగ్ నిజంగానే అఖిల్ కోసం వస్తున్నాడా? లేదో? తెలియాల్సి ఉంది. ఇక మళయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్‌ను.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాతో సాక్షి వైద్య అనే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!