Ranjeet Ranjan : యానిమల్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ వివాదం రాజ్యసభకు చేరింది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సందీప్ వంగా రెడ్డి దర్శకుడు. కాగా, సినిమాలో మహిళల పట్ల చూపిన ప్రవర్తన, హింసపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలో హింస, స్త్రీద్వేషాన్ని సమర్థించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
సభాపతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘కబీర్‌తో ప్రారంభిస్తే పుష్ప వరకు ఇప్పుడు యానిమల్ సినిమా వస్తోంది. దాంట్లో హింస విపరీతంగా పెరిగిపోయింది. నా కూతురితో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆమె కాలేజీలో చదువుతుంది. సగం సినిమా చూసి లేచి ఏడుస్తూ వెళ్లిపోయింది. స్త్రీల పట్ల ఎంత హింస, అగౌరవాన్ని సినిమాల ద్వారా చూపిస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.
Read Also:Revanth Reddy: సీఎండీ రాజీనామా ఆమోదించొద్దు.. ఇవాళ సమీక్షకు పిలవాలని సీఎం ఆదేశం
సినిమాలు సమాజానికి ఒక ‘వ్యాధి’ – రంజిత్ రంజన్
రంజిత్ రంజన్ ఇంకా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. ఈ హింస, నెగిటివ్ రోల్స్ హీరోలుగా ప్రజెంట్ చేస్తున్నారు. మన నేటి 11, 12 తరగతుల పిల్లలు వారిని ఆదర్శంగా భావించడం ప్రారంభించారు. సినిమా విడుదలకు ఆమోదం తెలిపినందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)ని, అలాంటి చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి బోర్డు ఉపయోగించే ప్రమాణాలను కూడా కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ఒక ‘వ్యాధి’ అని కూడా అన్నారు.
500కోట్ల క్లబ్ లో యానిమల్
డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ రోజురోజుకు వసూళ్లు రాబడుతోంది. థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా రాబట్టింది. అదే సమయంలో భారత్‌లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే, సినిమాలోని హింసకు సంబంధించి ప్రేక్షకులు కూడా ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వారు హింసను ఇష్టపడరు. యానిమల్‌లో బాబీ డియోల్ చిన్న పాత్రతో ప్రజలు కూడా నిరాశ చెందారు.
Read Also:CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ప్రర్యటన