ఎన్నికలకు మరో 6 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికీ, ప్రతి వాడకు, బహిరంగ సభల్లో పాల్గొంటూ తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. తమ పార్టీ గెలిస్తే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందని వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
Haryana: హర్యానాలో బీజేపీకి షాక్.. ప్రభుత్వానికి “చేయి”చ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు..
కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, మసీద్ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరారు. మీ అడుగడుగునా ఎలాంటి ఆపద రాకుండా ఎల్లవేళలా మీ క్షేమం కోసం కృషి చేస్తున్న నాయకురాలిగా కోరుతున్నాను, రానున్న ఎంపీ ఎన్నికల్లో తనను మీ ఎంపీగా గెలిపించి.. మీ అందరి అభివృద్ధికి మరోసారి తోడుపడేలా అవకాశం ఇవ్వగలరని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డి రాంరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, జెక్కిడి ప్రభాకర్ రెడ్డి, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, శిల్పారెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.