Bharat Jodo Yatra 2.0: లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే, భారత్ జోడో యాత్ర 2.0 రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగనుంది. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు కూడా భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తామని కాంగ్రెస్ నేత తెలిపారు. ఈ యాత్ర కోసం రెండు మార్గాలను కాంగ్రెస్ అన్వేషిస్తుంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రారంభమై.. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల మీదుగా కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పారు.
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి
ఇక, సార్వత్రిక ఎన్నికలకు మరి కొంత సమయం మాత్రమే ఉండటంతో ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రముఖులను సైతం ఈ యాత్రలో భాగం చేసేందుకు కాంగ్రెస్ చూస్తుంది. ఈ యాత్ర మొదటి విడతలో మాదిరిగానే ప్రతి రోజు రాహుల్ గాంధీ ప్రసంగించే బహిరంగ సభలపై ప్లాన్ చేస్తున్నారు. రేపటి నుంచి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారత్ జోడోయాత్రపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. తూర్పు నుంచి పశ్చిమ వరకు ర్యాలీ నిర్వహించాలని కూడా ఓ ప్రతిపాదన ఉంది. అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను కాంగ్రెస్ రూపొందిస్తుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ ర్యాలీ ఉంటుంది. భారత్ జోడో యాత్రను రాజకీయాలకు అతీతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా దేశ సామరస్యతను పెంపొందిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు.
Read Also: Pre Planned Bank Robbery: పక్కా ప్లాన్ ప్రకారమే.. ఐడీబీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ
అయితే, 2022 సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ తొలి విడత భారత్ జోడోయాత్ర ప్రారంభమై 2023 జనవరి 28లో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. సుమారు 4 వేల 80 కిలోమీటర్ల దూరం ఆయన కాలి నడకన ప్రయాణం చేశారు. ఇది 12 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా కొనసాగింది. 126 రోజులలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుధీర్ఘంగా రాహుల్ గాందీ పాదయాత్ర చేశాడు. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి సమస్యలనూ జోడోయాత్రలో కాంగ్రెస్ లేవనెత్తబోతుంది. ఈ యాత్రలో అధికార బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగం, అసమానత వంటి ఇతర సామాజిక-ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.