Bharat Jodo Yatra 2.0: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి భారత్ జోడో యాత్ర నిర్వహించాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ కోరింది. గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైన భారత్ జోడో యాత్ర తమిళనాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగింది. ఈ సారి భారత్ జోడో యాత్రం 2.0 తూర్పు నుంచి పడమర వరకు ని�
లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రెస్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే, భారత్ జోడో యాత్ర 2.0 రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగనుంది.
Bharat Jodo Yatra 2.0: నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ఊపు తీసుకువచ్చింది. మొదటిదశ సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభమైంది. దాదాపు 4,080 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ, యాత్ర జనవరి 2023లో జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది.