Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు (Delimitation Bill) పై విపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) లో ఏకాభిప్రాయం సాధించేందుకు కాంగ్రెస్ (Congress) కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సోనియా గాంధీ (Sonia Gandhi) నేడు మధ్యాహ్నం చెన్నై, సాయంత్రం ముంబై పర్యటనలకు వెళ్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)తో ఖర్గే భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం ముంబైకి బయలుదేరి, అక్కడ ఎన్సీపీ (SP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)తో సమావేశమవుతారు. గత మూడు రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి (Breach Candy Hospital) లో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌ను కాంగ్రెస్ అగ్రనేతలు ఆసుపత్రిలోనే పరామర్శించి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ కీలక సమావేశాలకు కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక, లోక్‌సభ (Lok Sabha), అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 1971 జనాభా లెక్కల (1971 Census) ఆధారంగా నిర్ణయించబడింది. దీనిపై ఉన్న నిషేధం 2026 తర్వాత ముగియనుండటంతో కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్ల సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. అయితే, తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే, జనాభా నియంత్రణ (Population Control) నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు (Southern States) తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడులోని డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గిపోయి, అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో (Northern States) సీట్లు భారీగా పెరుగుతాయని, ఫలితంగా పార్లమెంట్ (Parliament) లో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం బలహీనపడుతుందని విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ సున్నితమైన అంశంపై డీఎంకే, ఇతర మిత్రపక్షాలు స్పష్టమైన, కచ్చితమైన వైఖరిని కోరుకుంటున్నాయి. డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి అడుగు వేయడానికైనా ముందు మిత్రపక్షాల అభ్యంతరాలను వినాలని, కూటమిలో సమన్వయం సాధించి ఉమ్మడి వ్యూహాన్ని (Joint Strategy) రూపొందించాలని ఖర్గే, సోనియా గాంధీ ఈ పర్యటనల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
Also Read
- 11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
- Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
- Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
NDA Passing Out Parade: 364 మంది క్యాడెట్లు పాసౌట్.. యూనిఫామ్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
-
MS Dhoni: నేను తెలివితక్కువవాడిని అనుకుంటున్నావా?, ఊరికే 300కు పైగా వన్డేలు ఆడలేదు.. టీమిండియా బౌలర్‌పై ధోనీ ఫైర్!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!