Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Eagle Force: అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల సరఫరా ముఠాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ఈగల్ ఫోర్స్ అందించిన పక్కా సమాచారంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం దాదాపు 10 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో సుమారు రూ. 1.75 కోట్ల విలువైన 1,470 గ్రాముల అనుమానిత ఎండీ (MD) డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాగ్‌పూర్‌లోని సక్కర్దరా, మహల్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, ఈ దర్యాప్తు మధ్యప్రదేశ్‌లోని దేవాస్ వరకు విస్తరించింది. విద్యుత్ పంపిణీ బాక్స్ సమీపంలో రహస్యంగా దాచి ఉంచిన డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిల్వలో 820 గ్రాముల మెఫెడ్రోన్ (Mephedrone), 650 గ్రాముల క్రిస్టలైన్ పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్‌ను కలిపి రెండు గ్రాముల చొప్పున చిన్న బాల్స్‌గా తయారు చేసి, ఒక్కో బాల్‌ను రూ. 3,500 చొప్పున విక్రయించేందుకు నిందితులు ప్రణాళిక రచించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల వద్ద నుంచి రూ. 1,40,150 నగదు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్లు, ప్యాకింగ్ సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
Also Read
- Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
- AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
- 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
అదుపులోకి తీసుకున్న నిందితులను షేక్ రఫీక్ (48), అబ్దుల్ అరీఫ్ అలియాస్ చింటూ (24), ప్రతీక్ చంద్రకాంత్ కదమ్ (31)గా గుర్తించారు. వీరిలో ఒకరు కారు డ్రైవర్‌గా, మరొకరు దుస్తుల దుకాణంలో సేల్స్‌పర్సన్‌గా, ఇంకొకరు అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జితూ, రాజస్థాన్‌కు చెందిన సంజయ్ విశ్వకర్మ అలియాస్ అక్కీ భాయ్ నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, నాగ్‌పూర్‌తో పాటు పరిసర ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ పెద్ద నెట్వర్క్ మూలాలు, మధ్యవర్తులు, స్థానిక డీలర్లను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుని అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు నాగ్‌పూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
-
Los Angeles Earthquake: భూకంపం బీభత్సం.. ల్యాండింగ్‌కు సిద్ధమైన విమానం.. గాల్లోనే వెనక్కి మళ్లించిన ATC (వీడియో)
-
Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
-
AP Panchayat Elections 2026: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కత్తులు, వేట కొడవళ్లతో దాడులు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?