Jagga Reddy: హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
- సీఎం రేవంత్ ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్లు కేటాయించారు
- కేసీఆర్‌కు ఆ ఆలోచన లేదు
- ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా అంటూ ప్రశ్నించిన జగ్గారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులు కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ కేసీఆర్‌కు ఆ ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. రేవంత్, భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా శభాష్ అంటే.. పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో అనే భయంతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంచి చేస్తే తాము అభినందిస్తామని, కేసీఆర్‌కు అంత పెద్ద మనసు ఉండదు అంటూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Read Also: Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..
Also Read
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రజా బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా చేయడం కోసమే మున్సిపల్ శాఖ కూడా సీఎం తన దగ్గరే పెట్టుకున్నారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ హయంలోనే వచ్చిందని.. వ్యూహాత్మకంగా జంటనగరాల అభివృద్ధికి నిధులు కేటాయించారని అన్నారు. ట్రాఫిక్, డ్రైనేజ్, మురిక వాడలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. పిట్ట కథలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అని.. బీఆర్‌ఎస్ బడ్జెట్ హైప్ అని.. రేవంత్ బడ్జెట్ ప్రాక్టికల్ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.హుస్సేన్ సాగర్‌లో నీళ్ళు కొబ్బరి నీళ్ల లెక్క చేస్తా అన్నారు.. పదేళ్ళలో ఏమైందంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బడ్జెట్‌లో పెట్టి పనులు చేయబోతున్నారని తెలిపారు.
ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలు కూడా లేవని వెల్లడించారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో కూడా వర్షం వస్తే మునిగే కాలనీలు ఉన్నాయన్నారు. జీహెచ్‌ఎంసీకి రూ.3065 కోట్లు.. హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు.. హైడ్రాకు రూ.200 కోట్లు.. మెట్రో ఓల్డ్ సిటీ కోసం రూ.500 కోట్లు రేవంత్ సర్కార్ బడ్జె్ట్‌లో పెట్టిందన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో రేవంత్ 2024-25 లోనే హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని చేస్తున్న ప్లాన్ ఇది అంటూ పేర్కొన్నారు. కేసీఆర్ విమర్శలు రాజకీయం కోసమేనంటూ విమర్శించారు. కేసీఆర్‌కు విజన్ ఉంటే.. పదేళ్ళలో హైదరాబాద్‌కు నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!