Jagga Reddy: సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో హైదరాబాద్ అభివృద్ధికి 10 వేల కోట్ల నిధులు కేటాయించారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో రేవంత్ నిధులు వెచ్చించారు కానీ కేసీఆర్‌కు ఆ ఆలోచన లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు.. రేవంత్, భట్టిలకు అభినందనలు చెప్పాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.