TPCC Mahesh Goud : ఇదే మీ పార్టీ పరిస్థితిని అర్థమయ్యేలా చేస్తుంది.. కేసీఆర్‌పై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- కేసీఆర్ మాటలతో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా?
- ఫామ్ హౌజ్‌కే పరిమితమైన బీఆర్ఎస్ భవిష్యత్
- రేవంత్ రెడ్డి అభివృద్ధి vs కేసీఆర్ విశ్రాంతి : మహేష్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ బీ. మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చెప్పినంత మాత్రాన మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయినట్లా?” అని ప్రశ్నించారు. ప్రజలు తమ వెంటే ఉన్నప్పుడు, కాంగ్రెస్ బలంగా కొనసాగుతున్న సమయంలో, గ్రాఫ్ తగ్గిపోతుందన్న అభిప్రాయం అసత్యమని ఖండించారు.
ఫామ్ హౌజ్‌లో కూర్చొని పెన్ను, పేపర్ తీసుకుని గ్రాఫ్ గీస్తే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తగ్గిపోతుందా? అంటూ కేసీఆర్‌పై ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 56 శాతం బీసీలు తమ వెంటే ఉన్నారని, ఏడాదిలో 56,000 ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ సహా పలు కీలక హామీలను అమలు చేసినట్లు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతుందనే వాదన నమ్మశక్యం కాదని స్పష్టం చేశారు.
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
Gold Smuggling: భారత్-బంగ్లా సరిహద్దులో భారీగా బంగారం పట్టివేత.. ఒకరు అరెస్ట్
కేసీఆర్ గ్రాఫ్ పూర్తిగా కిందపడిపోయి, ఫామ్ హౌజ్‌కే పరిమితం అయిపోయిందని వ్యాఖ్యానించారు. “నీ అల్లుడు, బిడ్డ హరీష్ రావు, కవితలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే మీ పార్టీ పరిస్థితిని అర్థమయ్యేలా చేస్తుంది” అంటూ కేసీఆర్‌కు చురకలంటించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అదృశ్యం అవుతుందని, ఆ పార్టీలో తండ్రి, కొడుకు మాత్రమే మిగిలిపోతారని గౌడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు పగటి కలలు కనడం అలవాటుగా మారిపోయిందని, ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచించారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే సత్తా లేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. “ఫామ్ హౌజ్‌లో విశ్రాంతి తీసుకునే కేసీఆర్‌కు, అభివృద్ధిని పరుగులెత్తించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలికేంటీ?” అంటూ మండిపడ్డారు.
Madhubala : మహా కుంభమేళాలో పుణ్య స్నానమాచరించిన నాటి హీరోయిన్ మధుబాల
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!