కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు. సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలతో పాటు పలు విషయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నారు. జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్‌లో చీలిక ఖాయమని, దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: T.Nageswara Rao: నేతన్నలకు గుడ్ న్యూస్.. జౌళిశాఖ మంత్రి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
మోడీ మూడోసారి ప్రధాని అయిన కొన్ని నెలలకే జాతీయస్థాయిలో భారీ మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నిలువునా చీలినా ఆశ్చర్యం లేదన్నారు. దాని ప్రభావం కర్ణాటకపైనా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మంత్రులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదని.. వారి తరఫున వారి పిల్లలను బరిలో దించారని తెలిపారు. ప్రభుత్వంలో పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనమని బసవరాజ్ బొమ్మై చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Hair Coloring: తరుచుగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావచ్చు సుమీ..
ఇదిలా ఉంటే సోమవారం సిద్ధరామయ్య ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సిద్ధరామయ్యను డీకే.శివకుమార్ కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించకపోతే.. తన పదవికి ప్రమాదమని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Anushka – Vijayashanthi: విజయేంద్ర ప్రసాద్ కథతో రాములమ్మ, జేజమ్మ సినిమా?