Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Announced Two More Guarantees For Delhi Elections

CM Revanth Reddy: కాంగ్రెస్‌ను గెలిపించండి.. మరో రెండు గ్యారెంటీలు విడుదల చేసిన సీఎం

Published Date :January 16, 2025 , 1:28 pm
By Rajesh Veeramalla
  • ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్
  • ప్రతినెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
  • రూ. 500 కే ఉచిత సిలిండర్
CM Revanth Reddy: కాంగ్రెస్‌ను గెలిపించండి.. మరో రెండు గ్యారెంటీలు విడుదల చేసిన సీఎం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Read Also: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర సమయంలో ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చాం.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నాం.. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం.. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది.. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు.. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: USA Based Companies : ఒకరు దుకాణం కట్టేశారు.. మరొకరు సారి చెప్పారు.. 24గంటల్లోనే భారత్ ముందు తలొంచిన అమెరికా దిగ్గజాలు

తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ హామీ ఇచ్చారు.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప.. ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండని పేర్కొన్నారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు.. ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటే అన్నారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా పెంచారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలో గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. లిక్కర్ స్కాం పార్టనర్‌ను తెలంగాణలో ఓడించాం.. అసలు పార్టనర్‌ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అడ్డుకుంటే చాలు, ఆ నిధులతో పేదలకు మంచి చేయవచ్చు.. తెలంగాణలో అదే చేశామన్నారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Congress announced
  • Delhi
  • Delhi Elections
  • release

తాజావార్తలు

  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

  • AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!

  • KKR vs PBKS: రెండు మార్పులతో బరిలోకి కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..?

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions