Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమానులకు తెలియని విషయాలు దాదాపు ఏవీ ఉండవు. కానీ తాజాగా ఆయన తన పేరుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అసలు పేరు ‘పవన్ కళ్యాణ్’ కాదని, చిన్నప్పుడు తన తల్లిదండ్రులు తనకు వేరే పేరు పెట్టారని ఆయన స్వయంగా వెల్లడించారు. ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. తన బాల్యం, పేరు వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నారు. ఈ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు నామకరణం చేసిన పేరు శ్రీ కళ్యాణ్ కుమార్ అని వెల్లడించారు. స్కూల్లో జాయిన్ అయ్యే టైంకి తన పేరు నుంచి శ్రీ కనిపించకుండా పోయిందని సరదాగా చెప్పుకొచ్చారు. కె.కళ్యాణ్ కుమార్‌గా స్కూల్ రికార్డ్స్‌లో తన పేరు ఎక్కిందని చెప్పారు. సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సమయంలో తన గురువు కళ్యాణ్ కుమార్‌కు ముందు పవన్ చేర్చారని పేర్కొన్నారు. అలా తన పేరు పవన్ కళ్యాణ్ అయ్యిందని వెల్లడించారు. తన పేరుకు ముందు పవన్ అని చేర్చడానికి కారణం వివరిస్తూ.. తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే టైంలో తన పవర్ చూసి తన గురువు నువ్వు పవనపుత్ర హనుమంతుడిలాగా ఉన్నావ్ అని తన పేరు ముందు పవన్ అని జత చేసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మేము మొదట కళ్యాణ్ బాబుకు ‘శ్రీ కళ్యాణ్ కుమార్’ అని పేరు పెట్టాము. కానీ ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో ముద్దుగా ‘కళ్యాణ్ బాబు’ అని పిలిచేవాళ్లం” అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
- OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
- DADA Movie : 'దాదా'టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
తాజావార్తలు
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..