Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పెంపొందించడం, అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త కార్యాలయ వేళలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న ఆఫీస్ సమయాన్ని మార్పు చేస్తూ.. ఇకపై పనిదినాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. ఈ అదనపు పనివేళలకు బదులుగా.. ఉద్యోగులకు ఊరటనిస్తూ అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవుగా ఉండేవి. వారంతంలో రెండు రోజులు పూర్తి సెలవు దొరకడం వల్ల ఉద్యోగులు కుటుంబంతో గడపడానికి, మానసిక ఉల్లాసానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
ఉద్యోగుల హర్షం..
ఈ నిర్ణయంపై త్రిపుర సచివాలయ సీనియర్ అధికారి దులాల్ దేబ్ , ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి డాక్టర్ క్వీన్ శర్మ స్పందిస్తూ.. ఇది ఎంతో మంచి నిర్ణయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల తరహాలోనే తాము కూడా ఈ కొత్త వేళలకు అలవాటు పడతామని, జాతీయ స్థాయి జీతభత్యాలు ఆశించినప్పుడు ఆ స్థాయి పనితీరును ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యోగుల డిమాండ్..
త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. “వారంలో ఐదు రోజులు అదనపు సమయం పనిచేయడానికైనా మేము సిద్ధమే, కానీ శనివారం కూడా సెలవు ఇస్తే కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకోవడానికి, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఎంతో మేలు జరుగుతుంది” అని తెలంగాణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. త్రిపుర తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇక్కడి ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి.. పరిపాలనా సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన త్రిపుర ప్రభుత్వ నిర్ణయం.. ప్రభుత్వ రంగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!