Republic Day: గణతంత్ర వేడుకలపై వీడని సస్పెన్స్.. ఈ ఏడాది అక్కడేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day: రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 26న నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలపై సస్పెన్స్ వీడడం లేదు. వేడుకలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై సీఎంవో నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం. గతేడాది లాగే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహిస్తారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2021, అంతకుముందు సంవత్సరాల్లో రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి గవర్నర్ హాజరై ప్రసంగించే ఆనవాయితీ పాటించింది. కానీ రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరగడంతో గతేడాది నుంచి ప్రభుత్వం ఆనవాయితీలను పక్కనపెడుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపడంలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గోల్కొండ కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు, పబ్లిక్ గార్డెన్ లో గణతంత్ర దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ ఈ సారి కూడా పబ్లిక్ గార్డెన్ లో రిపబ్లిక్ వేడుకలు లేనట్టే కనిపిస్తోంది. రాజ్ భవన్ లోనే జాతీయ జండా ఎగురవేయనున్నారు గవర్నర్. ఉదయం పతాకావిష్కరణ గావించి.. సాయంత్రం ఎట్ హోం నిర్వహించనున్నారు.
Read Also: Over Sleeping : అతిగా నిద్రపోతే.. అటునుంచి అటే
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
పోయిన ఏడాది కరోనా సాకుతో ప్రభుత్వం గణతంత్ర వేడుకలు నిర్వహించలేదు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జెండాను ఆవిష్కరించారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో వేడుకలు నిర్వహించి.. ప్రభుత్వం పంపిన స్పీచ్ కాపీని చదివారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఇతర వివరాలను కలిపి గవర్నర్ ప్రసంగించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కాలేదు. ఇక ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పథకాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల వివరాలతో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి స్పీచ్ కాపీలు జీఏడీకి అందాయి. వాటన్నింటి నుంచి పూర్తి స్థాయి స్పీచ్‌ను తయారు చేసి గవర్నర్ ప్రసంగానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల కోసం గవర్నర్ కు ఎలాంటి ఆహ్వానం వెళ్లలేదు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. టైం ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నా.. ఏర్పాట్లపై అటు పోలీస్ శాఖ, ఇటు కల్చరల్ శాఖ, జీఏడీ మాత్రం కిమ్మనడం లేదు. గవర్నర్‌కు స్పీచ్ కాపీ ఇస్తారు కానీ.. ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం పిలవరు అన్న విమర్శలు వస్తున్నాయి.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కూడా ఆ పదం కలసి వచ్చేనా!?
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు