ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. వృద్ధిమాన్ సాహా (47), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (66) రాణించారు. అయితే.. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 20వ ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పాండ్యా పెవిలియన్‌కు చేరాడు. అప్పటి పాండ్యా 50 బంతుల్లో మూడు సిక్సులు, రెండు ఫోర్లతో 66 పరుగులు రాబట్టాడు.

Also Read : TPCC Chief Revanth Reddy At Bhagyalaxmi temple Live: భాగ్యలక్ష్మి టెంపుల్ కు రేవంత్ రెడ్డి
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక గుజరాత్ టైటాన్స్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లలో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
Also Read : GT vs LSG : 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్ ఇలా