ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలామంది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఫస్ట్ మీ పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ మార్చ్ 31,2023ని చివరి తేదీగా నిర్ణయించింది. 1000 రూపాయల జరిమానాతో ఇప్పుడు పాన్, ఆధార్ ను లింక్ చేయవచ్చు.. గడువులోపు మీరు రెండు ఐడీ కార్డ్ లను లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డ్ డీయాక్టివ్ అవుతుంది. జరిమానా లేకుండా పాన్ ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30,2020తో ముగిసింది.
Also Read : Bhatti Vikramarka: దేశం, రాష్ట్రం బాగుపడాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో వేద్దాం
AY21 కోసం అప్ డేట్ చేయబడిన ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చ్ 31,2023.. కాబట్టి మీరు AY21 (FY20) కోసం ఐటీఆర్ లో ఏదైనా సమాచారాన్ని పేర్కొనడం మరచిపోయినట్లయితే.. ఇప్పుడు దాన్ని పూరించడానికి సమయం అసన్నమైంది. ఐటీ చట్టం నిబంధన ప్రకారం, మీరు అసలు ఐటీఆర్ లేదా సవరించిన రిటర్న్ లో ఆదాయ వివరాలతో ఏదైనా పొరపాటు లేదా మినహాయింపులు చేసినట్లయితే ఐటీఆర్-యూని ఫైల్ చేయడానికి మీకు అనుమతి ఉంది. మీరు ఇప్పటికే అప్ డేట్ చేయబడిన ఐటీఆర్ ని ఫైల్ చేసి ఉంటే.. దాన్ని మళ్లీ ఫైల్ చేయడానికి మీకు అర్హత లేదు..
Also Read : YS Viveka murder case: అవినాష్‌రెడ్డి పిటిషన్.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
మీ పన్ను-పొదుపు పరిమాణాన్ని నిర్ణయించడానికి ప్రతి ఆర్థిక సంవత్సరాకి మార్చి 31 కటాఫ్ తేదీ అని గుర్తించుకోండి.. ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మీ పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించడంలో ఇది మీరు సహాయపడుతుంది. FY23లో ఆర్జించిన ఆదాయం కోసం.. సెక్షన్ 80సీ, 80డీ, 80ఈ కింద పన్ను మినహాయింపు పొందేందుకు మీరు అదే ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు పీపీఎఫ్, యూఎల్ఐపీ, ఈఎల్ఎస్ఎస్ మొదలైన వాటిలో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల పరిమితికి లోబడి, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంది. మీరు ఇంకా గరిష్ట పెట్టుబడి పరిమితిని పూర్తి చేయకుంటే, మార్చ్ 31,2023లోపు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు అలా చేయవచ్చు..
Also Read : Jagadish Reddy: బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తాం.. కవిత ఈడీ విచారణపై మంత్రి ధ్వజం
బడ్జెట్ 2023 ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో మొత్తం వార్షిక ప్రీమియం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న బీమాపై పన్ను విధించబడుతుంది. ఏప్రిల్ 1,2023న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన సాంప్రదాయ బీమా ( యూఎల్ఐపీ) కి ఇది వర్తిస్తుంది. పన్ను ఆదా సాధనంగా బీమాను ఇష్టపడే పెట్టుబడిదారులలో మీరు ఒకరైతే, ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే, బీమాను నష్ట నివారణ సాధనంగా కొనుగోలు చేయడం, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ఎంచుకోవడం ఎప్పుడూ మంచిది. అందుకే తొందరపడకండి..