Colours swathi : ఆ సమయంలో సినిమాలు మానేద్దాం అనుకున్నాను.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ను చూపిస్తూ దూసుకెళ్ళింది.కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అష్టా చమ్మ సినిమాలో నానీ జోడీగా నటించి మెప్పించింది. తర్వాత విక్టరీ వెంకటేష్ మరియు త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా నటించి మెప్పించింది. అష్టా చమ్మలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్వాతికి తమిళంలో కూడా మంచి మంచి ఆఫర్లు అందాయి. . తమిళం లో సుబ్రమణ్య పురం అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ ని అందుకుంది కలర్స్ స్వాతి.వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి దూసుకెళ్లింది కలర్స్ స్వాతి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సాధించింది.
నిఖిల్ జోడీగా ఆమె నటించిన స్వామిరార సినిమా తో కలర్స్ స్వాతికి మరో సూపర్ హిట్ లభించింది. ఆ తరువాత మరోసారి నిఖిల్ కార్తికేయ సినిమాలో నటించి మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.ఇక ఆ తరువాత సినిమా ఆఫర్స్ తగ్గడంతో.. పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయ్యింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలు మానేసి..ఫ్యామిలీ ని చూసుకుంటే గడిపేసింది.తాజాగా సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. రీ ఎంట్రీ లో తన ఇమేజ్ కు తగ్గట్టు కథలను సెలక్ట్ చేసుకుంటుంది. అయితే రీ ఎంట్రీ సందర్భంగా సోషల్ మీడియా ఛానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది స్వాతి. ఆ ఇంటర్వ్యూలలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కొత్తలో తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.డేంజర్ సినిమా చేస్తున్న సమయం లో అల్లరి నరేష్ గారు నాతో కంగారు గా నీకు సంబంధించి ఎదో యం.యం.ఎస్ వచ్చింది చూసావా అని ఒక వీడియో ను నాకు చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. ఛీ ఛీ ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డానుఅంతే కాదు అది చూసి సినిమాలు అప్పటికప్పుడే మానేద్దాం అనుకున్నాను.. కానీ నా స్నేహితులు ధైర్యం చెప్పడం వల్ల మళ్ళీ సినిమాలను కొనసాగించాను’ అంటూ చెప్పుకోచ్చింది కలర్స్ స్వాతి. ప్రస్తుంతం సోషల్ మీడియా లో ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!