బెంగళూరులోని ఐఐఎంలో కాఫీ షాప్ నడుపుతున్న ఓ దుకాణదారుడి భార్య ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.999 కోట్లు వచ్చాయి. తన భార్య ఖాతాలోకి ఇంత డబ్బు రావడంతో దుకాణదారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ అతని ఆనందం వెంటనే ఆవిరైపోయింది. 48 గంటల్లో ఈ మొత్తం డబ్బును విత్‌డ్రా చేసి, బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. ఇప్పుడు దుకాణదారుడు అందులో ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి నెలకొంది. అతని వ్యాపారం కూడా నిలిచిపోయింది. ఎందుకంటే తరచూ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
READ MORE: Vizianagaram Utsav: పైడితల్లి ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబు కేబినెట్కు ఆహ్వానం..
వ్యాపార వార్తాపత్రిక మింట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ప్రభాకర్ బెంగళూరులో ఒక చిన్న కాఫీ షాప్ నడుపుతున్నాడు. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన భార్య పొదుపు ఖాతాను పరిశీలిస్తున్నప్పుడు అందులో కోట్ల రూపాయలు ఉన్నట్లు చూశాడు. ఖాతాలో రూ.999 కోట్లు జమయినట్లు గుర్తించాడు. సంతోషించేలోపే వారి పరిస్థితి దుఃఖంగా మారింది. 48 గంటల్లో మొత్తం డబ్బును విత్‌డ్రా చేసి ఖాతాను క్లోజ్ చేశారు. పొరపాటున రూ.999 కోట్లు ఖాతాలోకి వచ్చాయని, ఆ తర్వాత ఖాతాను స్తంభింపజేశారని ప్రభాకర్ తెలిపాడు.
READ MORE:Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
తనకు సాయం చేయడానికి బదులు ఈ డబ్బు ఎలా వచ్చిందని బ్యాంకులు వివరాలు అడుగుతున్నాయని ప్రభాకర్ చెబుతున్నాడు. “ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులు అకౌంట్‌ని బంద్ చేశారు. బ్యాంకు వెళ్లినా.. ఫలితం లేకపోయింది. కొంత మంది విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బు కూడా అందులో ఉంది. ఆ నగదు కూడా తీసుకోవాడానికి వీలు లేకుండా చేశారు. దీనిపై బ్యాంకుకు మెయిల్ కూడా పంపినా ఎలాంటి సమాధానం రాలేదు.” అని వాపోయాడు. ఇదిలా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.