CNG vs EV Cars: ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వివిధ కంపెనీల కార్లు మార్కెట్లోకి విడుదలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్లన్నీ కొన్ని కొత్త డిజైన్లు, సరికొత్త ఫీచర్స్ తో వస్తాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా సిఎన్జి (CNG), హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల సందడి కొనసాగుతుంది. గతంలో కారులో కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ఆప్షన్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం మూడు ఎంపికలతో లభించే కారు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఎవరైనా కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే సిఎన్జి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ లలో ఏ కారు కొనడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుందో ఒకసారి చూద్దాం.
Read Also: Railway Ticket Discounts: వారందికీ 75% వరకు రైల్వే టికెట్ పై రాయితీ!
సిఎన్జి కార్లు :
ప్రస్తుతం చాలామంది పెట్రోల్, డీజిల్ తో పాటు సిఎన్‌జిని కూడా కార్లకు వాడుతున్నారు. సిఎన్జి కారులో తక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. దీని వల్ల కాలుష్యంకు కూడా మంచి జరుగుతుంది. నిజానికి సిఎన్జి ధర తక్కువే. కానీ, సిఎన్జి కిట్ ధర ఎక్కువ. అలాగే సిఎన్జి కిట్ కారణంగా మీ కారులోని బూట్ స్పేస్ కూడా తగ్గుతుంది. దీనితో పాటు సులభంగా సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లు లభించడం అంత సులువు కాదు. దీని కారణంగా కొద్దిపాటి సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
ఎలక్ట్రిక్ కార్లు (EVలు):
ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లకు చాలా డిమాండ్ ఉంది. ఈ కార్లు పర్యావరణ రహితానికి అనుకూలమైనవి. అలాగే చాలా తక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ కారు కొనడానికి ముందు, మీరు ఇంట్లో ఛార్జింగ్ సదుపాయాలను సిద్ధం చేసుకోవాలిసి ఉంటుంది. ఈ కార్లు ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారికీ బాగా సరిపోతుంది. ఎక్కువ దూరం వెళ్లే వారికీ ఇది పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే, ఛార్జింగ్ చేయడానికి సమయం పడుతుంది. అలాగే కారు ఛార్జింగ్ చేయకపోతే మీరు ఎక్కువసేపు డ్రైవ్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కోవలిసి వస్తుంది. దీనితో పాటు కారు బ్యాటరీ ప్రభావితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం.
Read Also: Kerala: కేరళ బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ నియామకం..
హైబ్రిడ్ కార్లు:
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హైబ్రిడ్ కార్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఈ కారులో మీరు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలెక్ట్రిక్ మోటారు లేదా సిఎన్జి సెటప్ ను పొందుతారు. అయితే, ఈ కార్లు ఖరీదైనవి. అలాగే వీటి నిర్వహణ ఖర్చు కూడా కాస్త ఎక్కువనే చెప్పాలి.