YSR Kapu Nestham: వారికి సర్కార్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి సొమ్ము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక.. మరో పథకానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.. రేపు వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నారు.. రేపు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.. వైఎస్సార్ కాపు నేస్తం” ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, వారికి మంచి జరగాలన్న తపనతో.. ఏటా రూ. 15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్ జగన్ సర్కార్.
ఇప్పుడు అందిస్తున్న రూ. 536.77 కోట్లతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం ఆర్థిక సాయం రూ. 2,029 కోట్లు… ఒక్కో పేద కాపు అక్క చెల్లెమ్మకు నాలుగేళ్ళ కాలంలో అందించిన లబ్ధి అక్షరాలా రూ.60,000గా ఉంది.. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో 5 ఏళ్లలో సగటున ఏడాదికి కనీసం రూ. 400 కోట్లు కూడా ఇవ్వని దుస్థితి ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 52 నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు అనేక రెట్లు అధికంగా మొత్తం రూ. 39,247 కోట్ల (DBT + Non DBT) లబ్ధి చేకూర్చింది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా, కాపుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొంది.. కాపుల సంక్షేమానికి మనందరి జగనన్న ప్రభుత్వం ఈ 52 నెలల పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివరాలు (డీబీటీ మొత్తం) లబ్ధిదారులు 61,36,196, లబ్ధి రూ. కోట్లలో 22,333, నాన్ డీబీటీ మొత్తం లబ్ధిదారులు 15,64,433, లబ్ధి రూ. కోట్లలో 16,914, మొత్తం (డీబీటీ, నాన్ డీబీటీ) లబ్దిదారులు 77,00,628, లబ్ధి రూ. కోట్లలో 39,247 చేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!