CM YS Jagan: నేటి నుంచి బస్సు యాత్ర.. ఎన్నికల ప్రచారానికి జనంలోకి జగన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు యాత్రను కొనసాగించనున్నారు.
Also read: Congress Final List: నేడు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ జాబితా!
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
ఆపై పొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ వద్ద రాత్రి శిబిరానికి ఆయన చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ లోనే రాత్రి జగన్మోహన్ రెడ్డి బస చేయనున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఆయన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా రోజుకొక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పనితీరుపై ఆయన భిన్న అభిప్రాయాలు అడిగి తెలుసుకోబోతున్నారు.
Also read: Ram Charan : రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలను చూస్తే మైండ్ బ్లాకే..
ఇక ఈ పర్యటనలో ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పలు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రజల్లోకి వచ్చినా., పోలీసుల నుండి కాస్త తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ప్రజలతో మమేకం అవుతూ.. జనం కష్టాలు వింటూ పాదయాత్రలు, రోడ్ షోలు చేసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక జనానికి కాస్త దూరంగా ఉంరని చెప్పొచ్చు. దీనికి కారణం పోలీసుల ఆంక్షలతో అన్ని పర్యటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సాధారణ జనాన్ని దూరంగా ఉంచడంతో అభిమానుల్ని, కార్యకర్తల్ని కాస్త నిరాశకు గురి చేసేది.
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!