Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన
- ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన అధికారి
- ఘటనపై విచారణకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో ప్రియురాలితో అధికారి పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అక్రమ ఖాతాలకు సంబంధించిన కేసులో లోకాయుక్త పోలీసులు శ్రీరంగపట్నంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (ADLR)గా పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. అయితే సదరు అధికారిని జైలుకు తరలించాల్సి ఉండగా.. ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే మండ్య జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి. చంద్రశేఖర్ ఆకస్మికంగా ఎంఐఎంఎస్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అయితే ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన న్యాయమూర్తికి.. హుస్సేన్ ఉన్న గదిని కూడా పరిశీలించారు. అయితే ఆ గదిలో ఓ యువతి కనిపించడం కలకలం రేపింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే తాను సదరు అధికారి ప్రియురాలినని చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యారు. దీంతో హుస్సేన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను జడ్జి ప్రశ్నించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందాల్సినంత తీవ్రమైన అనారోగ్యం లేదన్న విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
జైలు నుంచి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించడానికి గల కారణాలను కూడా న్యాయమూర్తి జైలు అధికారులను ప్రశ్నించారు. జైలు వైద్యుడి సిఫారసు మేరకే హుస్సేన్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. జైలు నుంచి ఆస్పత్రికి హుస్సేన్‌ను తరలించిన విషయం కోర్టుకు తెలియజేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే కోర్టుకు సమాచారం ఇవ్వలేదని ఓ జైలు అధికారి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకువస్తామని అధికారి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి జైలు అధికారులను మందలించారు. హుస్సేన్ ఆస్పత్రిలో చేరడం, అక్కడ ఉన్న పరిస్థితులపై జైలు అధికారులు, వైద్యాధికారులు పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?