Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన ‘క ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై వరుసగా సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్, క ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం సమర్పణలో వై.శివశంకర్ నాయుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంతో అనుష్ గోరక్ దర్శకుడిగా పరిచయం కానుండగా, తనూజ పుట్టస్వామితో పాటు కుష్లు, నమ్రిత ఎంవీ, రెహమాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ప్రయోగాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందులో ఓ పక్షి కాళ్లను మాత్రమే చూపిస్తూ.. ‘ఇటువంటి కథను మీరు ఇప్పటి వరకు తెరపై చూడలేదు.. ఇటువంటి జానర్‌ను మీరు ఊహించలేదు’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను పెట్టారు. దీంతో ఇది సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ అనే ప్రచారం మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ‘బిగ్ బాస్’తో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న తనూజ.. ఇప్పుడు తొలిసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నటనకు ప్రాధాన్యమున్న ప్రయోగాత్మక పాత్రతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా తనూజకు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!