CM YS Jagan: వెన్నుపోటు పోడవటం, మోసం చేయడం ఇదే చంద్రబాబు రాజకీయం.. ఎన్టీఆర్ కుర్చినీ లాక్కొని సొంత మామను చంపిందెవరు..? వంగవీటి మోహన రంగారావును కట్రలతో చంపిందెవరు? ఐఏఎస్ రాఘవేంద్రరావును కుట్రలతో చంపింది ఎవరు? అని అడుగుతున్నాను అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వియజనగరం జిల్లా బొబ్బిలి రోడ్‌లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడు జగన్‌ను చంపేస్తే అని అంటున్నది ఎవరు అని అడుగుతున్నా.. చంద్రబాబు నువ్వు అనుకుంటే సరిపోదు..! ప్రతి ఇంట లబ్ధిపొంది ప్రతి ఒక్కరూ రక్షక భటులుగా నాకు ఉన్నారని చెబుతున్నా అని హెచ్చరించారు. ఈ అక్క చెల్లెమ్మలే ఈ జగన్ కి శ్రీరామ రక్ష అన్నారు.
Read Also: Vijayasai Reddy: దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదు..
ఇక, వైఎస్ఆర్ చేస్తున్న లబ్ధిని చూచి గాలిలో కలిసిపోతావన్నావు.. ఇప్పుడు నన్ను అంటున్నావు… మమ్మల్ని ఎదుర్కో లేక ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యానంటున్నావు.. ప్రజలకు ఏం చేశావని అడుగుతున్నా..? అని నిలదీశారు. గతంలో ఈ ముగ్గురే కలిసి వచ్చి ఒక కరపత్రం ఇంటింటికీ ఇచ్చారు.. ఇందులో ఏమైనా నెరవేరాయా..? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై తొలిసంతకం అన్నారు ఆనాడు.. అయ్యిందా? పొదుపు సంఘాల రుణమాఫీ అన్నాడు.. అయ్యిందా? ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి కింద ఇరవైఅయిదు వేలు బ్యాంకులో వేస్తానన్నాడు.. వేశాడా?.. నిరుద్యోగ భృతి అన్నాడు, బీసీ సబ్ ప్లాన్, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్ సిటీ, ఐటెక్ సిటీ అంటూ హామీలిచ్చాడు.. ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశాడా? అని ప్రశ్నల వర్షం కురపించారు.. ప్రత్యేక హోదా ను అమ్మేశాడు.. మళ్లీ ఈ ముగ్గురే కలిసి వస్తున్నారు.. సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారు.. మళ్లీ మనం మోసపోతామా? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.