CM YS Jagan: నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్..? పాతవారే కొనసాగింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్ వేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని 130కి పైగా కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియపై స్పష్టతకు వచ్చింది వైసీపీ సర్కార్.. ఒకటీ రెండు చోట్ల మినహా.. దాదాపుగా అందరికీ కొనసాగింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. అయితే, గత నెలలో పలు కార్పొరేషన్ పాలకమండళ్ల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. అదే స్థానాల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లును కొనసాగించే అవకాశం ఉంది.. 56 బీసీ కార్పొరేషన్ల విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.
Read Also: Patnam Mahender Reddy: కేసీఆర్ కేబినెట్లోకి పట్నం మహేందర్ రెడ్డి.. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
అయితే, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరోమారు పదవుల పండుగ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్ పదవుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగింది.. తాను సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2021 జులై 17న 137 నామినేటెడ్ పదవులను ఒకేసారి భర్తీ చేశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు వీరందరి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే మళ్లీ ఇదే తరహాలో పదవులను ఒకేసారి భర్తీ చేయాలని, అదికూడా సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపికలు ఉండాలని డిమాండ్లు కూడా వినిపించాయి.. కానీ, అనూహ్యంగా పాతవారినే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారట.. దాంతో, నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?