Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.. గెలుపు గుర్రాల వేటలో పడిపోయారు నేతలు.. అయితే, అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగరాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా రెబల్‌గా పోటీ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ‘నేను రెబల్‌గా పోటీ చేస్తాను’ అంటే కుదరదు.. రెబల్‌గా వేస్తే సినిమా ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే పైచేయి ఉంటుందని, ఎన్నికల పోరు వార్ వన్‌సైడ్‌గా ఉంటుందని ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీల్లో పార్టీ బలోపేతానికి సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ‘ఒక్క టీడీపీ సినిమా మాత్రమే ఆడుతుంది’ అని జయరాం వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గుత్తి, గుంతకల్లు మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులపై ఆసక్తి ఉన్న ఆశావహుల నుంచి సమావేశంలో బయోడేటాలను స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, ఆశావహుల నుంచి వివరాలు సేకరించడం వంటి కార్యక్రమాలను టీడీపీ చేపట్టిన విషయం విదితమే..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తాజావార్తలు
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!