బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతోంది. సీఎం రేతంత్ రెడ్డితో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనగణన లో కులగణన చేశాం.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి గవర్నర్ కు పంపాము.. స్థానిక సంస్థల్లో 42 శాతం కోసం ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కు పంపామన్నారు.
Also Read:Instagram: యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ 3 కొత్త ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన రీల్స్ ను..
క్షేత్ర స్థాయిలో మేం చేయాల్సిన ప్రయత్నాలు చేశాం.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది.. ఢిల్లీలో బిల్ ను ఆలస్యం చేస్తున్నారు.. జాతీయ స్థాయిలో పోరాటం జరగాలని భావించాం.. లోక్ సభ, రాజ్యసభ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు డిల్లీకి వచ్చాం.. ఖర్గే, రాహుల్ లు తెలంగాణ ప్రక్రియను సమర్ధించారు.. సంపూర్ణ మద్దతు పలికారు.. దేశ స్థాయిలో జనగణన లో కులగణన చేర్చాలని, పార్టీ అగ్రనేతలు చెప్పారు.. రాహుల్, ఖర్గే, సోనియాలు ఓబీసీ లకు అండగా ఉన్నారు.. గల్లీ లో ఉండి మాట్లాడితే కుదరదు అని.. ఢిల్లీలో మోడీ పై నిరసన చేపట్టాలని వచ్చాం..
Also Read:Karavali: మరో ఇంట్రెస్టింగ్ పాత్రతో వస్తున్న రాజ్ బీ శెట్టి
నిన్న జంతర్ మంతర్ లో ధర్నా చేశాం.. మా ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలు మద్దతు పలికారు.. రాష్ట్రపతిని కలిసేందుకు 10 రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోరాం.. మేం అపాయింట్మెంట్ అడిగాక , రాష్ట్రపతిని మోడీ, అమిత్ షాలు కలిశారు.. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు.. మాకు అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకున్నారు.. దురదృష్ట వశాత్తూ మాకుఅపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఇది శోచనీయం, దారుణం అని మండిపడ్డారు.
