Karavali: మరో ఇంట్రెస్టింగ్ పాత్రతో వస్తున్న రాజ్ బీ శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేసిన టీం
సో ఫ్రమ్ సు, స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల విజయం తర్వాత, కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నారు. దర్శకుడు గురుదత్ గనిగ ‘కరవాలి’ అంటూ కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను తెరపైకి తీసుకు రాబోతోన్నారు. విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించబోతోన్నారు. ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ శక్తివంతమైన పాత్రలో రాజ్ బి శెట్టి కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరింత హైప్ పెరిగినట్టు అయింది.
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్‌లో కథను చెప్పీ చెప్పనట్టుగా చూపించారు. కానీ రాజ్ బి శెట్టి మాత్రం ఓ సూపర్ మెన్ తరహా పాత్రను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలోని ఆ కాగడ చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉన్నాయనిపిస్తోంది. ఈ మేరకు దర్శకుడు గురుదత్ గనిగ మాట్లాడుతూ.. ‘మేము సినిమా కథ రాసినప్పుడు, తీస్తున్నప్పుడు కూడా ఈ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. మొదటి టీజర్ విడుదల చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను మరింత గొప్పగా తీయాలని అనుకున్నాం. ఈ పాత్ర కోసం మేం చాలా మంది నటులను ప్రయత్నించాం. వారికి ఆ పాత్ర నచ్చింది, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు.
Also Read : Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత
ఈ సినిమా తీరప్రాంత ఆచారాల నేపథ్యంలో రానుంది. ఈ పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకునే నటుడే కావాలని మేం కోరుకున్నాం. నేను రాజ్‌ను కలిసి కథను వివరించాను. కానీ అతను అనేక కమిట్‌మెంట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ‘సో నుండి సు’ అనే సినిమా కూడా ఉంది. అయినా సరే నేను ఆయన్ను వదల్లేదు. ఐదు సమావేశాల తర్వాత అతను ‘మీకు అభ్యంతరం లేకపోతే, మీరు చిత్రీకరించిన కొన్ని భాగాలను నేను చూడవచ్చా?’ అని అడిగారు. నేను అందుకు అంగీకరించాను. ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నారు. చివరకు ఆయన మవీర అనే పాత్రకు ప్రాణం పోశారు’ అని అన్నారు.
Also Read :Arjun Chakravarthy: ఆగస్టు 29న ‘అర్జున్ చక్రవర్తి’
కర్ణాటక తీరప్రాంతంలో విస్తృతంగా చిత్రీకరించబడిన కరవాలి.. మనుగడ, విధేయత, మనిషి స్వభావం వంటి అంశాలతో తెరకెక్కించాం. “జంతువు vs మానవుడు” అనే ట్యాగ్‌లైన్ సినిమా భావోద్వేగ, సాంస్కృతిక అంశాలను ప్రతిబింబిస్తుంది. ప్రజ్వల్ మరియు రాజ్‌లతో పాటు ఈ చిత్రంలో మిత్రా, రమేష్ ఇందిరా, సంపద ప్రధాన పాత్రలో నటించారు. VK ఫిల్మ్ అసోసియేషన్, గనిగా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం, అభిమన్యు సదానందన్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివర దశల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతోన్నారు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?