CM Revanth Reddy : వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువుల కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హరీష్ రావుతో ఓ కమిటీ వేద్దాం.. అక్రమ నిర్మాణాలు దగ్గర ఉండి కూల్చివేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము చేస్తున్న మంచి పనులు చూసి పార్టీలోకి వస్తాం అంటున్నారు. భయపెట్టి, బ్రతినిలాడి ఎవర్నీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కేస్ బై కేస్ విచారణకు సీబీఐకి అనుమతి ఇచ్చామన్నారు. వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తెలిపారు. 111జీవో గత ప్రభుత్వం ఎత్తివేయ లేదు. ఆ జీవో అలానే ఉంది. ఆ జీవో రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు, ఎన్జీటిల అనుమతి ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుంకిశాలపై విచారణ జరుగుతుందని, 16 నెలలు జైల్లో ఉన్న సోసిడియా, ఇంకా జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు రాని బెయిల్ ఐదు నెలలు జైల్లో ఉన్న కవితకు బెయిల్ ఎలా వచ్చింది? అని ఆయన అన్నారు.
CM Revanth Reddy : వక్ఫ్ బిల్లుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం
అంతేకాకుండా..’ఎంపి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదలాయింపు చేశారు. అందుకే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో బీఆర్ఎస్ కు ఓట్లు తగ్గాయి. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపి సీట్లను త్యాగం చేసింది. బీఆర్ఎస్ కు ఒకరమైన న్యాయం… మిగతా వారికి మరొకరమైన న్యాయం జరుగుతుంది. కేసీఆర్ నాలుగు విడతల్లో 23లక్షల 61 వేల 899 మంది ఖాతాల్లో 13వేల 329 కోట్ల రుణమాఫీ చేశారు. ఒక్క నెలలో 22 లక్షల 37 వేల 848 ఖాతాల్లో 17వేల 933 కోట్ల రుణమాఫీ చేశాం. రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేశాం. రెండు లక్షలకు పైన రుణాలు తీసుకున్న రైతులు కూడా ఆపైన డబ్బులు బ్యాంకుల్లో కడితే వారికి కూడా రుణమాఫీ అవుతుంది. ఎవరెవరికి రుణమాఫీ కాలేదో కేటీఆర్, హరీష్ లు గ్రామగ్రామాన తిరిగి వివరాలు సేకరించి.. కలెక్టర్లకు ఇవ్వాలి. ఆగస్టు 31కి కొత్త బిసి కమిషన్ ఏర్పాటు చేస్తాం. విభజన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారుల కమిటీ ఏర్పాటు చేసాం. త్వరలో ఆ కమిటీ సమావేశం అవుతుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
David Malan: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్..
పదేళ్లు బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి పై సోయి లేదు. సచివాలయం నిర్మించినప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు? తెలంగాణ ప్రతిరూపం, దర్పం ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. వాళ్లా మాకు నీతులు చెప్పేది.?. మల్లారెడ్డి, పళ్ల, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు ఎవరైనా హైడ్రాకు సమానమే. అక్రమ నిర్మాణాలు చేసిన వారిని బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలి. అక్రమ నిర్మాణాలపై అవసరమైతే ప్రజా కోర్ట్ పెడదాం. బీఆర్ఎస్ కు నిజాన్ని నిరూపించుకునేందుకు మంచి అవకాశం. అక్రమ నిర్మాణలు ఉంటే నా ఫ్యామిలీ దైనా నేనే కులగొట్టిస్తా. నేను జన్వాడ బయట పెట్టినట్లు… కేటిఆర్ ఆధారాలతో రావాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!