CM Revanth Reddy: సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు.. సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం జరుపుకుంటేనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు.. మహిళ నాయకత్వం నుంచి వచ్చిన పార్టీ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మహిళా రాష్ట్రపతి బిల్లు ఆమోదం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇతర ఉన్నత విభాగాల్లో పనిచేసేలా మహిళలకు అవకాశం కల్పించిన 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. మహిళలు శక్తితో పోలుస్తాం.. కుటుంబ గౌరవాన్ని సైతం మహిళలతో పోలుస్తామన్నారు. మహిళలకు వేధింపులు పట్టణాలు కాలేజీలు పబ్లిక్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదని.. సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాలని సూచించారు. సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసే వ్యక్తులపై సీఎం సీరియస్ అయ్యారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
READ MORE: India Playing XI: అభిషేక్ విషయంలో కోచ్, కెప్టెన్ సంచలన నిర్ణయం.. టీమిండియా తుది జట్టు ఫిక్స్!
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల కేటాయింపులు, రేషన్ కార్డులు అన్ని మహిళలు పేర్లమీద ఇస్తోందని.. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో మహిళలు అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తోంది.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా వారి స్వేచ్ఛ పెరిగిందన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించి మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ సహా కీలక అధికార పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం మాదే అని చెప్పుకొచ్చారు. మహిళల శక్తి, నైపుణ్యంపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని.. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యమన్నారు. మహిళల రక్షణను సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని.. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, రాష్ట్రం, దేశం బలపడుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలు ధైర్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలి.. ఎక్కడైనా మహిళలపై వేధింపులు జరిగితే నిలబడి ప్రశ్నించే ధైర్యం సమాజంలో రావాలని సూచించారు.. కాలేజీలు, బస్టాండ్లు సహా ఎక్కడైనా జరిగే వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలపై సైబర్ వేధింపులు పెరుగుతున్నాయని.. మహిళలపై మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వంటి సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!