CM Revanth Reddy: ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను నేడు అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.
ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్మల దేవి ఫంక్షన్ హాల్లో గౌడ, శెట్టిబలిజ కుల సంఘాల నాయకులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఐదు ఉపకులాలు కలిపి గౌడ కులం ఒక్కటే ఉండాలనేది తన కోరిక అన్నారు. అందుకు బీసీలు అంతా ఏకం కావాలని తెలిపారు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని కులాల వారికి జనసేనలో అవకాశం ఇస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.…