Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- యూరప్‌లో ఇంధన ధరలు మంటలు
- త్వరలో G7 దేశాల సమావేశం
- వ్యూహాత్మక నిల్వల నుంచి ఆయిల్ విడుదలపై చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూరప్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న వారాల్లో G7 దేశాల సమావేశాన్ని నిర్వహించి.. వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి కొంత మొత్తాన్ని మార్కెట్లోకి విడుదల చేసే అంశంపై చర్చించనున్నట్లు మాక్రాన్ వెల్లడించారు. ఇంధన సరఫరా, ఉత్పత్తి సామర్థ్యం, ఎగుమతుల విషయంలో G7 దేశాల మధ్య మరింత సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
పారిస్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాక్రాన్ మాట్లాడారు. పెరుగుతున్న ఇంధన ధరలు యూరప్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. చమురు నిల్వల విషయంలో పరస్పర సహకారాన్ని పెంచేందుకు G7 సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దీంతో యూరప్‌లో ఇంధన ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ వారంలో యూరప్ డీజిల్ బెంచ్‌మార్క్ ధర బ్యారెల్‌కు 200 డాలర్లను దాటింది. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరుకుంది. పన్నులు కలుపుకుంటే యూరప్‌లో రిటైల్ ధరలు బ్యారెల్‌కు 300 డాలర్లకు పైగా ఉన్నట్లు సమాచారం.
Also Read
- Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
- Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
- Trump Assassination Threat: ట్రంప్ హత్యకు కుట్ర?.. మూడు తుపాకులతో వైట్‌హౌస్ వద్ద వెనిజులా వ్యక్తి పట్టివేత
- Paraguay Crisis: పరాగ్వేలో రాజకీయ సంక్షోభం.. అధ్యక్ష పదవి నుంచి శాంటియాగో పెనా తొలగింపు, గృహనిర్బంధం!
ఇంధన ధరలను నియంత్రించేందుకు వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించుకోవడంపై G7 దేశాలు చర్చించనున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA ఈ ఏడాది ప్రారంభంలో అత్యవసర నిల్వల నుంచి రికార్డు స్థాయిలో ఇంధనాన్ని ప్రపంచ మార్కెట్లలోకి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. యూరప్‌లోని వ్యూహాత్మక నిల్వల్లో ప్రధానంగా పెట్రోల్, డీజిల్ వంటి శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులు ఉండటం వల్ల.. నిల్వల విడుదల వల్ల మార్కెట్లో ఇంధన ధరలపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సమన్వయమే లక్ష్యం
వ్యూహాత్మక నిల్వల స్థాయిపై G7 దేశాల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు.. ఎగుమతులు, ఉత్పత్తి సామర్థ్యంపై మరింత సహకారం అవసరమని మాక్రాన్ తెలిపారు. అనవసర ఉద్రిక్తతలను నివారించడం, G7 దేశాలు, వాటి ప్రధాన భాగస్వాముల మధ్య ఇంధన సహకారాన్ని పెంచడం, వ్యూహాత్మక నిల్వలను అవసరమైతే విడుదల చేసే అవకాశాలను పరిశీలించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రకటించిన ప్రణాళికలో భాగంగా IEA సభ్య దేశాలు ఇప్పటివరకు 300 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు IEA శుక్రవారం వెల్లడించింది. యూరప్‌లో ఇంకా గణనీయమైన పరిమాణంలో అత్యవసర చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని IEA చమురు మార్కెట్ల విభాగం అధిపతి గత వారం పేర్కొన్నారు. ముఖ్యంగా యూరప్‌లో మరింత నిల్వలు ఉన్నట్లు తెలిపారు.
రాబోయే నెలల్లో డీజిల్, జెట్ ఫ్యూయల్, సహజ వాయువు వంటి ఇంధన ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు ఫ్రాన్స్ చర్యలు చేపడుతోంది. అధిక ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సోమవారం సమావేశమై మరిన్ని చర్యలపై చర్చించనుందని మాక్రాన్ తెలిపారు. మధ్యప్రాచ్య పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించుకునే అంశంపై G7 చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
-
Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..