Lavanya Records Her Statement on Raj Tarun Case: రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా తాళి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి, అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, 15 కుక్కలను తన మీద వదిలేశాడని చెబుతూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన లావణ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేసింది. ఇక ఈ క్రమంలోనే పోలీసులు లావణ్య ఆధారాలతో పాటు ఆమె స్టేట్మెంట్ ని సైతం రికార్డ్ చేశారు.
Mahesh – Dhoni: ఒకే ఫ్రేములో సినీ-క్రికెట్ సూపర్ స్టార్లు..
ఇక ఈ క్రమంలోనే లావణ్య మాట్లాడుతూ నార్సింగి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని, ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం అన్ని వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తమ పెళ్ళికి సంబంధించిన అధరాలు కూడా సబ్మిట్ చేశామని అన్నారు. తాను మాట్లాడిన అన్ని విషయాలు పోలీసులు రికార్డ్ చేశారని తాను మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు నన్ను ఎలా భయపెట్టారు అనే విషయం మీద స్టేట్మెంట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక రాజ్ తరుణ్ గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడారనే విషయం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారని, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి హైదరాబాద్లో సాగుతున్న బోనాలు ఇతర కార్యక్రమాల కారణంగా పోలీసులు బందోబస్తు డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ కారణంగా కేసు దర్యాప్తు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తమకు చెప్పినట్టు లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు.