CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మాటలయుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండని, లగచర్లలో జరిగిందంటున్నారు.. మరి ఆనాడు మల్లన్నసాగర్‌లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మీ ఫాంహౌజ్‌కు నీరు తీసుకెళ్లారా లేదా.. ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్‌హౌజ్‌ల కోసం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రాజెక్ట్‌ల దగ్గర ఎవరికి ఫాంహౌజ్‌లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా.? అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన ఆలోచన మీకు ఉంటుంది.. మాకెందుకు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కోల్పోయినప్పుడు రైతులకు బాధ ఉంటుంది.. లగచర్లలో అసైన్డ్ భూములకు కూడా 20 లక్షలు ఇచ్చాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్‌బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో..
అధికారులను చంపండి అని మీ మాజీ ఎమ్మెల్యే చెప్పింది పబ్లిక్ డొమైన్‌లో ఉందని, కేటీఆర్, హరీష్ చూసుకుంటారని మీ మాజీ ఎమ్మెల్యే అన్నారని రేవంత్ పేర్కొన్నారు. మీర అత్యంత అవినీతి చేసిన ప్రాజెక్ట్ మీద కమిషన్ విచారణ జరుగుతోందని, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. తొందర్లోనే వీరు జైలుకు వెళ్తారు.. వచ్చే సభలో కాళేశ్వరం విచారణ నివేదికపై చర్చ పెడదాం అని ఆయన అన్నారు. టెండర్ ప్రక్రియలోనే వీళ్లు జైలుకు పోతారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు రీడిజైన్ చేశారన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్‌ను కామారెడ్డిలో ప్రజలు ఓడించారన్నారు. నేను ఓడిపోయినా.. నిన్ను కూడా ఓడిస్తా అని కేసీఆర్‌కు అప్పుడే చెప్పానన్నారు సీఎం రేవంత్. ఏడాదిలో 2 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చానన్నారు. ఇది నా సమర్థత అని ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ గుంటూరులో చదివిన తెలివితేటలు ఇక్కడ చూపాలనుకుంటున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
Bombay High Court: “ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం విడాకులకు కారణమే”..