Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిజామాబాద్ నగరం, ఆర్మూర్‌లో పర్యటించనున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఆర్మూర్‌లోని ఆలూరు బైపాస్, జమ్మనజట్టి గల్లీ, గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా రోడ్ షో కొనసాగనుంది. అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. నగరంలోని గోల్ హనుమాన్ చౌరస్తా, ఆర్యసమాజ్, బడా బజార్, పోస్టాఫీసు మీదుగా రోడ్ షోలో సీఎం పాల్గొంటారు. నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తామని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.
Read also: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన ప్రచారం.. ఇంకా మిగిలింది 4 రోజులే..
నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
* పూలాంగ్ చౌరస్తా నుండి నగరంలోకి వచ్చే వాహనదారులు ఆర్ఆర్ చౌరస్తా, వర్ని చౌరస్తా, బోధన్ బస్టాండ్ నుండి గాంధీ చౌక్‌కు వరకు.
* కంఠేశ్వర్ వైపు నుండి బస్టాండ్‌కు ఎన్టీఆర్ స్క్వేర్, రైల్వే స్టేషన్, ఫ్లైఓవర్ నుండి వచ్చే వాహనదారులు.
* బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా అర్సపల్లి రైల్వే గేట్ మీదుగా బస్టాండ్‌కు రావాలి.
* హైదరాబాద్ నుండి వచ్చే మరియు వెళ్ళే వాహనాలు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్, ఖానాపూర్ ఎక్స్ రోడ్ మరియు దుబ్బా చౌరస్తా మీదుగా ప్రయాణించాలి.
* ఆర్మూర్ వెళ్లే వాహనదారులు కంఠేశ్వర్ బైపాస్, కొత్త కలెక్టరేట్ వైపు ఖానాపూర్ ఎక్స్ రోడ్, దుబ్బా చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
* బాన్సువాడ వైపు నుంచి వచ్చే మరియు వెళ్లే వాహనాలు వర్ని చౌరస్తా నుంచి ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, అర్సపల్లి రైల్వే గేట్, కొత్త కలెక్టరేట్ వైపు నుంచి ఖానాపూర్ ఎక్స్ రోడ్డు, దుబ్బ చౌరస్తా, శివాజీ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.
Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..