CM Revanth Reddy : అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు చేస్తే.. జైల్లో పెట్టిస్తాం..
- ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- 2014-19 వరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు
- పాలకుర్తిలో ఒక రాక్షసుడు రాజ్యమేలుతుంటే.. కొండను బద్దలు కొట్టింది కూడా ఆడబిడ్డనే
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలు మంత్రివర్గంలో ఉన్నారు. :సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని, ఇద్దరు ఆడబిడ్డలకు మేము మంత్రి వర్గంలో చోటు కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ, అంబానీలను తలదన్నేలా మహిళలను వ్యాపారవేత్తలను చేస్తామని, కాళోజీ కళాక్షేత్రం పదేళ్లైనా పూర్తి చేయని దద్దమ్మలు ఈ రోజు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణను ప్రపంచం గుర్తిస్తే గత పాలకులు గుర్తించలేదని, కాకతీయుల గొలుసుకట్టు చెరువులు ప్రపంచానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓరుగల్లు సంస్కృతి ఎంతో గొప్పదని, చారిత్రాత్మక నగరంగా వరంగల్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవరకు నేను నిద్రపోను.. అధికారులను నిద్ర పోనివ్వనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అని, రాష్ట్రాన్ని తాగుబోతులుగా మార్చి అధికారంలో కూర్చోవాలని అనుకున్నాడన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో కోల్పోయారు అని మాట్లాడుతున్నారని, మా ప్రజలు ఏమి కోల్పోలేదు. మీరు ఫామ్ హౌస్ లో కూర్చోండి, రోజుకో సీసా పంపిస్తామన్నారు సీఎం రేవంత్.
Andhra Pradesh: ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
అంతేకాకుండా..’మీ నౌకరీ పోతే, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము. భద్రకాళి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి, చేసిన. మాట ఇస్తే తల తెగిపడ్డా వెనక్కి పోను. అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది. పదేళ్లలో ఎవరికి రుణమాఫీ చేశారో అసెంబ్లీ లో చర్చ చేద్దాం, ఏ బిల్లా రంగా వస్తారో రండి. 18500 కోట్ల ఆదాయం ప్రతి నెలా వస్తోంది. 6500 కోట్లు జీతాలు, పెన్షన్లకే పోతోంది. 6వేల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నం. 5500 కోట్ల ఆదాయం మాత్రమే మిగిలితే రుణమాఫీ చేసి ఇతర సంక్షేమ పథకాలకు వాడుతున్నాం. కడుపు కట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాం. మూడు సార్లు ఓడినా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పాత్ర బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలి. నువ్వు బయటకు రావు, ఇద్దరు చిల్లరగాల్లను పంపుతున్నావు. కేటీఆర్ ఇయ్యాల, రేపు కిషన్ రెడ్డి మాట్లాడుతారు. మూసీ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను, 1200 మంది బలిదానాలను చూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. సోనియమ్మ మా అమ్మ, 4కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మ. సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్ళు పోసుకోవాలి. కిషన్ రెడ్డికి తెలంగాణలో బతికే హక్కు లేదు. నరేంద్ర మోడీకి గులాం గిరీ చేసే కిషన్ రెడ్డి తట్టా, బుట్ట సర్దుకొని గుజరాత్ వెళ్లిపోవాలి. సోనియమ్మ లేనిదే తెలంగాణ లేదు. నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. కాళోజీ స్ఫూర్తిగా తెలంగాణ ద్రోహులను పాతరెయ్యాలి. కేసీఆర్ మొలక మళ్ళీ ఎత్తకుండా చేస్తా.. కేసీఆర్ ముందు, ఎనకా అన్ని తెలుసు.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.. దమ్ముంటే అసెంబ్లీ కి రా కేసీఆర్ చూసుకుందాం.. ఒక్కొక్కన్ని తొక్కుకుంటూ అసెంబ్లీ కి వచ్చా: సీఎం రేవంత్ రెడ్డి..’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్‌కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!