JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రమోషనల్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాల్లో జోజో ఒకటి. దేవా కట్టా సమర్పిస్తున్న రూరల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అని చెబుతూనే, మేకర్స్ ‘కాషన్ టూ’ పేరుతో కొత్త గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. కిరణ్ జయకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృష్ణ కమల్, మహేష్ శ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జొన్నగిరిలో జరిగే వజ్రాల వేట చుట్టూ తిరిగే ఈ కథలో, తాజాగా విడుదల చేసిన glimpse పలు అంశాలతో పాటు కామెడీతోనూ ఆకట్టుకుంటోంది. హీరో, హీరోయిన్ని ప్రేమిస్తానంటాడు.. దానికి బదులుగా ‘‘పడుచు పిల్ల కానొస్తే… ఓ నాలుగు దినాలు వెనక పడి… పని కానిచ్చుకొని… పారిపోయే టైపా? ఇష్టపడిన పిల్లని దాని బాధ్యతలతో సహా పెళ్ళి చేసుకొని దాన్ని జీవితాంతం మోసెంత గుండకాయ ఉన్న మొగోడి టైపా అని’’ ఆ పిల్ల ప్రశ్నిస్తాది .. దానికి హీరో బదులిస్తూ..‘‘సత్య ప్రమాణికంగా చెబుతున్నా ఒకతూరి మాట ఇచ్చినానంటే మడమ తిప్పని వంశం మాది… బాలయ్య బాబు టైపు’’ అని హీరో గడుసుగా సమాధానం ఇస్తాడు.
హీరోయిన్ మరి హీరోని ప్రేమిస్తాదా! అని తెలియాలంటే మాత్రం ‘జో జో’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. కృష్ణ కమల్ , మహి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూరల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ దర్శకుడు దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకుడిగా రూపొందుతోంది. విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కాషన్ 1కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్.. గురువారం జో జో సినిమా నుంచి కాషన్ 2 వీడియో విడుదల చేశారు. ఈ సినిమాను విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. ఆయన గతంలో దర్శకుడిగా పలు సినిమాలు చేశారు. కాషన్ వన్ వీడియోతో సినిమాపై మేకర్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
Also Read
- Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
- Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
- Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
తాజావార్తలు
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
-
Prabhas Birthday: వంగా స్టైల్లో డార్లింగ్ బర్త్‌డే.. ‘స్పిరిట్’ పిక్ చూశారా!
-
Hyderabad : పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!