హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.