NTV Telugu Site icon

Telangana CM: ప్రధాన మంత్రిని పెద్దన్న అంటే తప్పేముంది

Ts Cm

Ts Cm

CM Revanth Reddy: తెలంగాణలో ప్రతిపక్ష నేతనే లేడు ఉంటే అసెంబ్లీకి వచ్చే వారు కదా అని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో తెలిపారు. కేసీఆర్ లాగా మేము మోడీకి చెవిలో ఏమీ చెప్పలేదు అన్నారు. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేశారు.. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని వంద రోజుల్లో సరిదిద్దీ పనిలో ఉన్నాం.. వంద రోజుల మా పనితనంపై వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వండి అని ఆయన చెప్పుకొచ్చారు. మా పాలన మీద మాకు విశ్వాసం ఉంది.. పారదర్శక పాలన అందిస్తున్నాం అని తెలిపారు. నాలుగు నెలల గడువు అవసరమా అని ప్రశ్నించారు. కేసీఆర్ కి పొలిటికల్ పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారు.. లీగల్ గా చర్యల కోసం ప్రాసెస్ ఉంటుందన్నారు. అయితే, విచారణ లేకుండా ఎవరికి ఉరిశిక్ష వేయలేం కదా.. మేడిగడ్డ రిపేర్ లపై కేసీఆర్ హరీష్ రావుల వాదనకు కంటెంట్ లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: Pawan Kalyan: దేశ సంస్కృతిని కాపాడేది బీసీలే.. వారిపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం

తాము చేసిన దొంగతనం కప్పిపుచ్చుకునేందుకే రిపేర్లు చేయాలని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. దొంగతనం చేసిన వాళ్ళే సపరేట్ గా మేడిగడ్డకు వెళ్లారు.. మాతో కలిసి మేడిగడ్డకు ఎందుకు రాలే అని ప్రశ్నించారు. మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు. నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ నివేదికకు నాలుగు నెలల గడువు అవసరమా.. బీజేపీ- బీఆర్ఎస్ సర్దుబాటు చేసుకోవడానికి నాలుగు నెలలు గడివిచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు.

Read Also: NTR: దేవర అవ్వలేదు.. వార్ మొదలెట్టలేదు.. అప్పుడే ఇంకొకటా.. ?

ఇక, మోడీని అభివృద్ధి పనులు అడుగుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మీలాగా ప్రేమని పంచమని అడగం.. ఎల్ఆర్ఎస్ పై టీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.. బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు గుమ్మి కింద పందికొక్కుల బలిసిపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిరిసిల్లలో కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి కోరారు. మా కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయరు అని చెప్పుకొచ్చారు. అలాగే, మా రాష్ట్రానికి కావలసింది నేను మైక్ లోనే చెప్పా.. మోడీ సర్జికల్ స్ట్రైక్ పై రేవంత్ కౌంటర్ ఇస్తూ.. మా స్ట్రైక్ కూడా చూస్తారు అంటూ వెల్లడించారు. ఇక, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా మిత్రుడు ఏం కాదు ఆయనపై ఉన్న మబ్బులన్నీ తొలగిపోతున్నాయి.. మా ప్రభుత్వం పడిపోతుందని పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు.. ప్రధానమంత్రి పెద్దన్న దాంట్లో తప్పేముంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.