CM Revanth Reddy: నర్సంపేటపై వరాల జల్లు.. రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- నర్సంపేటపై వరాల జల్లు
- రూ.532.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- బీఆర్ఎస్ ఈ పదేళ్లలో భారీగా ఆస్తులు సంపాదించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటిస్తున్నారు. రేవంత్ తో సహా వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వరంగల్ ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు సీఎం రేవంత్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నర్సంపేటపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్. రూ.532.24 కోట్లతో నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
శంకుస్థాపన పనుల వివరాలు:
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ, మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.17.28 కోట్లతో నర్సంపేట- పాఖాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ. 56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ. 20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Also Read:Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్‌లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
అనంతరం బహిరంగసభలో పాల్గొని సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఈ పదేళ్లలో భారీగా ఆస్తులు సంపాదించారు.. కానీ ఈ ప్రాంతం అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ.. వరికి ప్రోత్సాహకాలిచ్చామని తెలిపారు. ఉచిత విద్యుత్ పేటెంట్ మా పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పాలకులు ఫాంహౌస్ లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు.. ఉద్యమగడ్డ వరంగల్ కు మాత్రం ఏమీ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేయలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసింది.. రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.. 3 కోట్ల 10 లక్షల మందికి ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదవాళ్లకు ఇచ్చారు.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చి పేదల్ని మోసం చేశారు.. పేదల ఆత్మ గౌరవం పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కు ఏమేమి ఉన్నాయో వరంగల్ కు కూడా అవే తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మార్చి 31 లోపల వరంగల్ లో ఎయిర్ పోర్టును ప్రారంభించుకుంటామన్నారు. వరంగల్ లో అండర్ డ్రైనేజ్, ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించుకుంటాం.. సౌర విద్యుత్ ని ఉత్పత్తి చేసే బాధ్యతను మహిళలకు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!