Site icon NTV Telugu

CM Revanth Reddy: నల్లమల రైతులకు శుభవార్త.. ఉచిత సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని సీఎం హామీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్‌ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్‌’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్‌ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు.

READ MORE: CM Revanth Reddy: రాష్ట్రంలోని ఆ ఐదారుగురు సన్నాసుల గురించి పట్టించుకోను..

ఈ నేపథ్యంలో సీఎం రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. వందరోజుల్లో సోలార్‌ విద్యుత్ మోటార్‌ అందిస్తామని శుభవార్త చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తామన్నారు. దిగ్గజ కంపెనీలతో పోటీపడేలా శిల్పారామం దగ్గర మహిళలకు స్టాళ్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చానని గుర్తు చేశారు. నేడు ప్రతి పేదవాడి ఇంటికీ సన్న బియ్యం అందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు.

READ MORE: Kakarla Suresh: అభివృద్ధి, సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీఠ వేశారు!

“గతంలో వరి వేస్తే ఉరే అని ఆనాడు అన్నారు.. ఆ దొర మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు.. మీరు వరి పండిస్తే బోనస్ ఇస్తామని మేము చెప్తున్నాం.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరూ తినేవారు కాదు.. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నాం. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో మనమే నంబర్‌ వన్‌ అని కేంద్రం చెప్పింది.. శాంతి భద్రతల్లో కూడా మనమే నంబర్‌ వన్‌లోనే ఉన్నాం.. రాష్ట్ర ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్‌ వన్‌ అని కేంద్రమే చెప్పింది.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాం.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version